ఫించన్ల రద్దు..తులం బంగారం ఏది?:హరీష్ ఫైర్

7
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లను రద్దు చేసింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీష్… తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటికీ మొదలుపెట్టింది లేదు అన్నారు.

రూ.4000 పింఛన్ ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు… ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తున్నారు అన్నారు. కన్నేపల్లి పంపులను ఇప్పుడు ఆన్ చేసినా.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుతాయి అన్నారు.

గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు అని ఆరోపించారు హరీష్‌. మధ్యాహ్న భోజనం పథకంలో బిల్లులు రాలేదని ధర్నా చేస్తే కేసులు పెట్టడం దారుణం అన్నారు. రెండేళ్ల నుంచి కోడిగుడ్ల టెండర్లలో గుత్తేదారు ఎంపికలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని… రేవంత్ రెడ్డి మూటలు మోయడానికి ఢిల్లీ వెళ్తున్నాడు తప్ప.. పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు అన్నారు.

Also Read:అనుష్క..’ఘాటీ’ రిలీజ్ డేట్

- Advertisement -