పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై ప్రైవేటు క్రికెట్ టోర్నీల్లో పాకిస్థాన్ పేరును వాడేందుకు ఉన్న అనుమతిని పీసీబీ రద్దు చేసింది. ఒకవేళ ఉపయోగించుకోవాలని అనుకుంటే మాత్రం పీసీబీ అనుమతి తప్పని సరి అని పేర్కొంది.
ఇంగ్లాండ్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతుతోండగా కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడేందుకు టీమ్ఇండియా క్రికెటర్లు నిరాకరించిన సంగతి తెలిసిందే.పాక్‌తో ఆడేందుకు టీమ్ఇండియా మాజీలు నిరాకరించారు… ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి టోర్నీల్లో పాక్ పేరును వాడకూడదు అని తెలిపింది పీసీబీ.
తప్పనిసరి అయితే పీసీబీ అనుమతి తీసుకోవాల్సిందే. లేకపోతే చట్టమైన చర్యలు తీసుకుంటాం అని పీసీబీ వర్గాలు తెలిపాయి. శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది పీసీబీ.
Also Read:పీఎం కిసాన్ 20వ విడత నిధులు రిలీజ్

