- Advertisement -
బలగం సినిమాలోని – ‘ఊరు పల్లెటూరు’ పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో జాతీయ అవార్డు సాధించారు ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్. ఈ సందర్భంగా భీమ్స్కు, బలగం టీమ్‌కు అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణలోని పల్లెవాసనకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లిన బలగం సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కడం నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అన్నారు. “బలగం”లోని ప్రతి ఒక్క సభ్యునికి శుభాకాంక్షలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Also Read:జాతీయ ఉత్తమ చిత్రం..12th Fail
- Advertisement -

