మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా

4
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా పడింది. వచ్చే నెల 5,6,7 తేదీల్లో ఢిల్లీలో బిజీ షెడ్యూల్ కారణంగా తెలంగాణలో మీనాక్షి పాదయాత్ర వాయిదా పడింది. ఆగస్టు 15 తర్వాత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయనుంది పార్టీ.

వాస్తవానికి ఈనెల 31 నుంచి నియోజకవర్గాల్లో మీనాక్షి పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేశారు. వారం రోజుల పాటు నియోజవర్గాల్లో పాదయాత్ర జరిగేలా ఏర్పాట్లు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై…. ఆంధోల్, అర్ముర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు. కానీ పార్టీ కార్యక్రమాల వల్ల పాదయాత్ర వాయిదాపడింది.

మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని బిర్లాగ్రామ్ నగ్డాలో జన్మించారు మీనాక్షి. బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగా ఎన్ఎస్ యూఐ లో చేరిక ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపిక కాగా 2009 నుంచి 2014 వరకు మందసౌర్ నుండి ఎంపీగా గెలుపొందారు.

Also Read:ఉస్తాద్…పవన్ లుక్ అదుర్స్!

- Advertisement -