ఐటీకి కేరాఫ్ ఏపీ: చంద్రబాబు

7
- Advertisement -

ఏపీలో పెట్టుబడి అవకాశాలపై సింగపూర్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రులు లోకేశ్, టీజీ భరత్, నారాయణ, సింగపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను వివరించారు సీఎం చంద్రబాబు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని… అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

2026 జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీల పెట్టుబడులకు అవకాశాలు. సింగపూర్ కంపెనీలు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలు పొందటంతోపాటు పరిశోధనలు చేయొచ్చు అన్నారు.

Also Read:పల్లెల్లో మద్యం దుకాణాలు..ఇదేనా మార్పు?

- Advertisement -