సింగపూర్‌లో చంద్రబాబు..అప్‌డేట్

4
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్‍తో చంద్రబాబు భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్‍తో సీఎం చర్చించారు.

రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. సింగపూర్‍పై అభిమానంతో గతంలో హైదరాబాద్‍లో సింగపూర్ టౌన్‍షిప్ నిర్మించామని తెలిపారు చంద్రబాబు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానం అందించగా మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

నాలెడ్జి ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని తెలిపారు సీఎం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్లు, పోర్టులు ఉండగా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు సీఎం. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో సింగపూర్ సహకరించాలని కోరారు.

Also Read:తెలంగాణ కేబినెట్ భేటీ..

- Advertisement -