దళిత నాయకుడు సాయిలు బట్టలిప్పి అవమానించినట్టు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పి బుద్ధి చెప్పాలి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ సాక్షిగా దళిత బిడ్డను కాంగ్రెస్ అవమానించగా అంబేద్కర్ జయంతి నాడే ఎల్లారెడ్డి నియోజకవర్గం, లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో.. ఉద్యమ కారుడు, దళిత బిడ్డ ముదాం సాయిలు బట్టలూడదీసి అవమానించింది కాంగ్రెస్ సర్కార్. ఇవాళ అదే అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా సన్మానించారు కేటీఆర్.
అనంతరం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీదారులకు లక్షలు ఖర్చు చేసి భోజనం పెట్టిండు కానీ మన గురుకుల విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం చేతనైతలేదు అని దుయ్యబట్టారు.
Also Read:డీలిమిటేషన్‌పై సుప్రీం సంచలన తీర్పు
అంబేద్కర్ జయంతి నాడు లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో ఉద్యమ కారుడు, దళిత బిడ్డ ముదాం సాయిలును అవమానించిన కాంగ్రెస్ సర్కార్ పైన తప్పకుండా బద్లా తీసుకుంటాం అని తెలిపారు కేటీఆర్. ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంతకముందు ముదం సాయిలు ఇంట్లో భోజనం చేశారు కేటీఆర్.

