గ్రీన్ ఇండియా ఛాలెంజ్, మాజీ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకోని సామాజిక సేవలో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ఉదయం 10.00గంటలకు బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ హై స్కూల్ లో మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్ల చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు 100 బెంచీలు అందజేయడం జరిగింది.
అదే విదంగా 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువులో మొదటి రెండు స్థానాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధినీవిద్యార్థులకు 20 సైకిళ్లను ప్రదానం చేయడం జరిగింది.

మాజీ మంత్రి వర్యులు, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతూ యువ నాయకులు, బడుగు బలహీన వర్గాల వారికి నిరంతరం వెన్నంటి ఉండే నాయకులు KTR గారి పుట్టినరోజు పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు స్కూల్ పిల్లలకు బెంచీలు, సైకిల్ లు అందచేయడం గొప్ప విషయం అని కొనియాడారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమం లో మాజీ చైర్మన్ లు, మాజీ BC కమిషన్ మెంబర్ లు, క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దలు, పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్స్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:రాజీవ్ కనకాలకు పోలీస్ నోటీసులు

