- Advertisement -
సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చారు రాచకొండ పోలీసులు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421లోని వెంచర్ లో రాజీవ్ కనకాలకు చెందిన ఓ వివాదాస్పద ప్లాటు ఉంది.
నిర్మాత విజయ్ చౌదరికి ప్లాటు విక్రయించారు రాజీవ్ కనకాల. సదరు ప్లాటును మరో వ్యక్తికి రూ.70 లక్షలకు విక్రయించారు విజయ్ చౌదరి. లేని ప్లాటును ఉన్నట్లు చూపించి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.
బాధితుల ఫిర్యాదు మేరకు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అలాగే హయత్ నగర్ పీఎస్ లో విజయ్ చౌదరిపై కేసు నమోదు అయింది.
Also Read:కేటీఆర్ బర్త్ డే..సంతోష్ విషెస్
- Advertisement -

