వీరమల్లు రిలీజ్…చంద్రబాబు ట్వీట్

7
- Advertisement -

పవన్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న #HariHaraVeeraMallu చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ … చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు చంద్రబాబు.

ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే… సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్.

గత పదేళ్లలో పలుమార్లు చంద్రబాబుతో సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు… ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది అన్నారు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అని పేర్కొన్నారు పవన్.

Also Read:Review:హరిహర వీరమల్లు

- Advertisement -