పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రమే కాదు ఆయన డిప్యూట్ సీఎం అయ్యాక వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో పవన్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం…
కథ:
హరి హర వీరమల్లు ఫిక్షనల్ స్టోరీ. అధర్మంపై పోరాడే ఓ యోధుడి కథ. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై వీరమల్లు చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం ముహమ్మద్ కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూ.. మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, అతని దురాగతాలను కళ్లకి కట్టిన చిత్రం వీరమల్లు. జిజియా పన్ను కట్టాలనే దారుణమైన పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హరిహర వీరమల్లు ఎలాంటి యుద్ధాన్ని చేశాడు? అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ నటన. తన శక్తికి మించి నటించారు పవన్. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపించారు. ఫస్టాఫ్‌లో ఔరంగజేబు అరాచకాలను అతని దగ్గరే ఉన్న కొహినూర్ వజ్రం కోసం వీరమల్లు వేట సెకండాఫ్‌లో మొదలౌతుంది. క్లైమాక్స్ చివరి 18 నిమిషాలు సూపర్బ్. ఇక నిధి అగర్వాల్ తన అందంతో సినిమాకు మింత గ్లామర్ తీసుకొచ్చింది. బాలీవుడ్ టుడు బాబీ డియోల్ విలక్షన విలనిజాన్ని ప్రదర్శించాడు. మిగితా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ..ఔరంగజేబు క్రూరత్వం, కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు పోరాటం..వెరసీ ధర్మం కోసం జరిగిన యుద్ధంను అనుకున్న స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయారు. ముఖ్యంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న లోటు స్పష్ఠంగా కనిపించింది. వీరమల్లు కథలో దర్శకత్వ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్లు కూడా అంతగా నచ్చవు.
Also read:తేజ సజ్జ..’మిరాయ్’ ఫస్ట్ సింగిల్!
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. వీరమల్లుకు కీరవాణి మ్యూజిక్కే బ్యాక్‌బోన్. సాంగ్స్ పర్వాలేదు. పాటలకంటే బుర్రా సాయి మాధవ్ మాటలు బాగా పేలాయి. పవర్ స్టార్ కోసం చాలానే పవర్ ఫుల్ డైలాగ్‌లు ఉన్నాయి.
తీర్పు:
ఎట్టకేలకు పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడి ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. జిజియా పన్ను కట్టాలనే దారుణమైన పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హరిహర వీరమల్లు ఎలాంటి యుద్ధాన్ని చేశాడు? అన్న నేపథ్యంలో దర్శకుడు జ్యోతికృష్ణ సినిమాను తెరకెక్కించాడు.ఓవరాల్‌గా పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే చిత్రం హరిహర వీరమల్లు.
విడుదల తేది:24/07/2025
రేటింగ్:3/5
నటులు:పవన్ కళ్యాణ్,నిధి అగర్వాల్
సంగీతం:కీరవాణి
నిర్మాత:ఏఎం రత్నం
దర్శకుడు: జ్యోతి కృష్ణ

