నేటి నుంచి ఇంగ్లండ్ తో టీమిండియా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా మ.3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 5 టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో ముందంజలో ఉంది స్టోక్స్ సేన. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్ కు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సిరీస్‌కు దూరం కాగా.. పేసర్లు అర్షదీప్ సింగ్, ఆకాశ్‌దీప్ లు నాలుగో టెస్టు ఆడరని గిల్ చెప్పాడు. అయినప్పటికి తమ జట్టులో 20 వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారన్నాడు. అన్షుల్ అరంగేట్రానికి దగ్గరగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇక కరుణ్ నాయర్‌కు మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించాడు గిల్.
మూడో టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ గాయపడగా నాలుగో టెస్ట్‌లో ఆడతాడని స్పష్టం చేశాడు. అతడే వికెట్ కీపింగ్ సైతం చేస్తాడని అన్నాడు. ఇప్పటికే నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
ఇంగ్లాండ్ జట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్, లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
Also Read:జోషి దర్శకత్వంలో ఉన్ని ముకుందన్!

