సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్

5
- Advertisement -

సిట్ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. విజయవాడలోని సిట్ కార్యాలయంకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి.. తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి మాటలతో కేసు పెట్టారు.. ఎలాంటి ఆధారాలు లేవు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. మిథున్ రెడ్డి సిట్ కార్యాలయం వద్దకు చేరుకోవటంతో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సిట్ కార్యాలయం వద్ద బారికేట్లు పెట్టిన పోలీసులు.. ట్రాఫిక్ పక్క రోడ్లకు మళ్లించారు. సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read:TTD:ఆగ‌స్టు 6 నుండి తెప్పోత్స‌వాలు

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. సుప్రీం కోర్టులో సైతం పిటిషన్ తిరస్కరణకు గురికాగా ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు మిథున్.

- Advertisement -