అథర్వా మురళి, నియమిష సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ DNA. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను పొందింది. నెల్సన్ వెంకటేశన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాదం “My Baby” పేరుతో సినిమా డిజిటల్ రిలీజ్‌కు ముందురోజే థియేటర్లలో విడుదలైంది. హోమ్ ఆడియన్స్ నుంచి ఈ సినిమా ఎలా స్పందన పొందుతుందో చూడాలి మరి.
ఈ చిత్రానికి ఘిబ్రాన్ వైబోధా నేపథ్య సంగీతం అందించగా, సత్యప్రకాశ్, శ్రీకాంత్ హరిహరణ్, ప్రవీణ్ సైవీ, సాహి శివా, అనల్ ఆకాష్ కలిసి పాటల్ని కంపోజ్ చేశారు. ఓలింపియా మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Also Read:హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఇల్లు కూల్చేస్తారా?

