ఏఎం రత్నంపై నిధి ప్రశంసలు!

7
- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా కథ మొఘల్ కాలంలో నేపథ్యంగా సాగుతుంది. ఇందులో కల్పిత పాత్రలతో పాటు చారిత్రక పాత్రలు కూడా ఉంటాయి. కథానాయిక నిధి అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది.

ఈ సందర్భంగా నిధి మాట్లాడుతూ.. ఏఎం రత్నంని ఆకాశానికెత్తేస్తూ ప్రశంసలు కురిపించింది. రత్నం సార్ ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఇలాంటి భారాన్ని భరించి, సినిమా పూర్తిచేయడానికి ముందు వచ్చిన నిర్మాత ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని నేను భావిస్తున్నాను. ఆయనపై నాకు అమితమైన గౌరవం ఉంది అన్నారు.

ఒక వ్యక్తిగా ఆయనే ఈ సినిమాను ఐదేళ్లుగా భుజాల మీద మోస్తున్నారు. నా కోసం కాదు కానీ, రత్నం సార్ కోసం ఈ సినిమా విజయం సాధించాలి అనిపిస్తోంది. ఆయన పెట్టిన శ్రమకి అది సరైన ఫలితం అవుతుంది అన్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూలై 21న జరగనుంది.

Also Read:TTD:ఆగ‌స్టు 6 నుండి తెప్పోత్స‌వాలు

- Advertisement -