అనుపమ.. పరదా రిలీజ్ డేట్

3
- Advertisement -

తన తొలి సినిమా ‘సినిమా బండి’ ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం ‘పరదా’తో వస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం 2025 ఆగస్టు 22న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా దర్శనా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథానాయికగా అనుపమ ఒక సాంఘిక మరియు ఆధ్యాత్మిక సంక్లిష్టతల మధ్య ప్రయాణించే పాత్రలో కనిపించనుంది. ఈ కథ ఓ సాంస్కృతికంగా సంపన్నమైన నేపథ్యాన్ని కలిగి ఉంటుంది.

Also Read:Bihar:ఫ్రీ కరెంట్..సీఎం నితీశ్ ప్రకటన

ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువా కలిసి ఆనంద మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీతాన్ని గోపీ సుందర్ అందిస్తున్నారు.

- Advertisement -