SSMB 29:షూటింగ్‌కు బ్రేక్?

12
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది SSMB 29 అంటే 29వ సినిమా. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

హైదరాబాద్‌ మరియు ఒడిశాలో కీలక షెడ్యూల్స్‌ను పూర్తిచేసిన తర్వాత, SSMB29 తదుపరి ముఖ్యమైన షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుతం కెన్యాలో జరుగుతున్న రాజకీయ ప్రకంపనల కారణంగా ఆ షెడ్యూల్ రద్దైనట్లు సమాచారం.

Also Read:గోదావరి నీళ్లు..రేవంత్ అబ్బ సొత్తు కాదు!

ఈ అనుకోని పరిణామం నేపథ్యంలో, రాజమౌళి తదుపరి యాక్షన్ షెడ్యూల్ కోసం దక్షిణాఫ్రికా లేదా టాంజానియాను పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే కథలోని కొన్ని భాగాలను మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉందని మహేష్ బాబు మరియు రాజమౌళి భావించారని ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా జక్కన్న – మహేష్ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -