భార్యల చేతిలో భర్తల హతం

7
- Advertisement -

గత 5 సంవత్సరాలలో 785 మంది భర్తలు హతమయ్యారు. దేశవ్యాప్తంగా భర్తల మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జాతీయ నేర రికార్డుల గణాంకాలు ఇలా ఉన్నాయి.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భర్తల మరణాలలో మొదటిస్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో ఇక్కడ 45 మంది భర్తలు చనిపోయారు. 2021లో ఈ సంఖ్య 52 కు చేరుకుంది. 2022లో 60 కి చేరుకుంది. 2023లో 55కు చేరుకుంది. 2024 లో 62 కు పెరిగింది.

బీహార్ రాష్ట్రంలో 2020లో 30, 2021లో 35, 2022లో 40, 2023లో 39, 2024లో 42 మంది భర్తలు హతమయ్యారు.రాజస్థాన్ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 20, 2021 సంవత్సరంలో 25, 2022 సంవత్సరంలో 28, 2023 సంవత్సరంలో 30, 2024 సంవత్సరంలో 35 మంది భర్తలు హతమయ్యారు.

మహారాష్ట్రలో 2020 సంవత్సరంలో 15, 2021లో 18, 2022 లో 20, 2023లో 22, 2024లో 25 మంది భర్తలు హతమయ్యారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 12 మంది, 2021లో 15 మంది, 2022లో 18 మంది, 2023లో 20 మంది, 2024లో 22 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు.

Also Read:ప్యారా గ్లైడింగ్ ..యువకుడు మృతి

- Advertisement -