బెట్టింగ్ యాప్స్ కేసు..ఈడీ ఎంటర్!

6
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై కేసులు నమోదుకాగా తాజాగా ఈడీ ఎంటరైంది. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేసిన ప్రముఖులు, వారి ప్రోత్సాహంతో అనేక మంది అక్రమ ఆన్లైన్ బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు గుర్తించి, ED ఈ చర్య తీసుకుంది.

ED నమోదు చేసిన కేసులో ఉన్న వారి వివరాలను పరిశీలిస్తే… రానా దుగ్గుబాటి, ప్రకాశ్ రాజ్,విజయ్ దేవరకొండ,మంచు లక్ష్మి,ప్రణిత సుభాష్,నిధి అగర్వాల్,అనన్య నాగళ్ల,సిరి హనుమంత్,శ్రీముఖి,వర్షిణి సౌందరరాజన్,వసంతి కృష్ణన్,శోభ శెట్టి,అమృతా చౌదరి,నయని పవని,నేహా పఠాన్,పండు,పద్మావతి,ఇమ్రాన్ ఖాన్,విష్ణు ప్రియా,హర్ష సాయి,భయ్యా సన్నీ యాదవ్,శ్యామల,టేస్టీ తేజ,రీతూ చౌదరి,బండారు శేషయానీ సుప్రీత ఉన్నారు.

అలాగే బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ఆపరేటర్లు కిరణ్ గౌడ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అజయ్, సన్నీ, సుధీర్, యూట్యూబ్ చానెల్ ‘లోకల్ బాయ్ నాని’ తదితరుల పేర్లు ఉన్నాయి. వీరందరిని విచారించనుంది ఈడీ. డిజిటల్ వాలెట్ల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగనుంది. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంటర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:యాక్షన్ సీక్వెన్స్‌లో ‘ది పారడైజ్’

- Advertisement -