ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్ మోడల్?:కేటీఆర్

7
- Advertisement -

గుజరాత్‌లోని మ‌హిసాగ‌ర్ న‌దిపై నిర్మించిన గంభీర వంతెన కుప్పకూలగా పలు వాహనాలు నదిలో మునిగాయి. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. మోర్బీ వంతెన కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే, డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ ఉన్న గుజరాత్‌లో మరో వంతెన నదిలో కూలిపోయింది అన్నారు.

గుజరాత్‌లో, డబుల్ ఇంజిన్ ఉన్న బీహార్, మధ్యప్రదేశ్‌లలో వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి? వీటిపై ఎన్‌డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు విచారణ జరుపుతాయా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఇదేనా మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ ‘మోడల్’? ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి! అని డిమాండ్ చేశారు. గాయ‌ప‌డ్డ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.

 

Also Read:ఓటీటీలోకి ..’8 వసంతాలు’!

- Advertisement -