- Advertisement -
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్‌కు సాయం అందించారు నటుడు విశ్వక్ సేన్. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్‌కి తన వంతుగా రూ. 2 లక్షల సాయం అందించారు విశ్వక్.
గత కొన్నేళ్లుగా ఫిష్ వెంకట్ డయాలసిస్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రస్తుతం ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని ఆయన కుమార్తె స్రవంతి తెలిపారు. వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారని, అయితే దాత కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రభాస్ సాయం చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ విషయం తెలిస్తే ప్రభాస్ తప్పకుండా సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:వీరమల్లు… తమిళ రైట్స్!
- Advertisement -

