రేవంత్ బుల్డోజర్ రాజ్ పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. పేదలు, మధ్య తరగతి ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గం అన్నారు.
హైకోర్టు స్టే ఉన్నా, హైదరాబాదులో గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే..రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ, హైడ్రా అధికారులు ఒక్క ఇంటిని కూడా వదలకుండా నేలమట్టం చేయడం అమానుషం అన్నారు.
“సామాన్లు తీసుకుపోతాం.. సమయం ఇవ్వండి” అని పేదలు వేడుకున్నా కనికరం లేకుండా బుల్డోజర్లు ఇండ్లకు మీదకు నడపడం అమానవీయం..ఉత్తర ప్రదేశ్ లో బిజేపీ చేస్తున్న బుల్డోజర్ రాజ్ కు దీటుగా తెలంగాణలో బుల్డోజర్ రాజ్ నడిస్తున్నారు అన్నారు. ఒకవైపు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, “మోహబ్బత్ కి దుకాన్” అంటూ ప్రేమ సందేశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాత్రం బుల్డోజర్ రాజ్ చేస్తూ పేదల గూడు కూల్చుతున్నడు అన్నారు.
ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?,తెలంగాణ సీఎంను రాజ్యాంగ విలువలకు, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సిద్ధాంతాలకు లోబడి నడుచుకునేలా ఆదేశించండి అని సూచించారు. ఉత్తరప్రదేశ్ తరహా బుల్డోజర్ రాజ్‌ను తెలంగాణలో నడపవద్దని రేవంత్ రెడ్డికి సూచించండన్నారు.
The Ruthless Hydra Injustice Against the Poor and Middle Class Continues at Hyderabad.
Despite a stay order from the Hon’ble High Court, the Revanth Reddy-led Congress government has gone ahead with the brutal demolition of homes at Guttala Begumpet, Hyderabad.
Under heavy… pic.twitter.com/7DJt29jCra
— Harish Rao Thanneeru (@BRSHarish) July 1, 2025
Also Read:పెరిగిన రైల్వే ఛార్జీలు

