- Advertisement -
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు అధికారులు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారులు.
మొత్తం 14 గేట్లు ఉండగా.. అన్నింటినీ పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు అధికారులు. ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరచి ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలిపెట్టారు కేంద్ర జల సంఘం అధికారులు.
Also Read:పెరిగిన రైల్వే ఛార్జీలు
- Advertisement -

