- Advertisement -
హీరోయిన్ ఇలియానా మళ్లీ తల్లయ్యారు. రెండో బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జూన్ 19న ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ బాబు ఫొటోను కూడా ఇలియానా పోస్ట్ చేశారు.
మా ప్రియమైన అబ్బాయి ‘కియాను రఫే డోలన్’ ను పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పలువురు సెలబ్రెటీలు ఇలియానాకు విషెస్ చెబుతున్నారు.
అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మైఖల్ డోలన్ను ఇలియానా 2023లో వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం ఆగస్టులో ఇలియానా- డోలన్ తల్లిదండ్రులయ్యారు. ఆ చిన్నారికి కోవా ఫీనిక్స్ డోలన్‌గా నామకరణం చేశారు.
View this post on Instagram
- Advertisement -

