పెళ్ళి చేసుకుంటే..పైసల్‌ దండగ..

214
- Advertisement -

బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యాచులర్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్‌ ఖాన్‌.51 సంవత్సరాల వయసొచ్చినా….పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు ఈ కండలవీరుడు. అయితే  సల్మాన్‌ తన పెళ్ళి విషయంలో చేస్తున్న లేట్‌ ఫ్యాన్స్‌ కు ఏ మాత్రం రుచించడం లేదు. హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి పలువురు హీరోయిన్‌లతో ప్రేమాయణం నడిపిన ఈ హీరో, వారిలో ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోలేకపోయాడు.

అయితే గత రెండేళ్లుగా మోడల్‌ లులియ్‌వంతుర్‌తో సల్మాన్‌ ప్రేమాయణం నడిపిస్తుండగా, వీరిద్దరి పెళ్లి కూడా త్వరలో  జరగబోతున్నట్లు గత ఏడాది క్రితమే వార్తలు వచ్చాయి.

Love is nothing but need and marriage a waste of money

అయితే ఎందుకో తెలీదు కానీ పెళ్ళి విషయంలో సల్మాన్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. తాజాగా ప్రేమ, పెళ్లిపై అసహనాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు తన దృష్టిలో పెళ్లి చేసుకోవడం అంటే డబ్బు వృథా చేసుకోవడమేనని కామెంట్లు చేశాడు కండలవీరుడు.

“తాను ప్రేమను ఎంతమాత్రం విశ్వసించనని, ప్రేమ అనేది ఒకటి ఉందని చెప్పడానికి కారణాలు తనకేవీ కనిపించలేదని, ఇప్పుడు ఉన్నదల్లా అవసరమేనని తెలిపారు. ప్రేమ అంటే కేవలం మౌలికమైన అవసరమేనని” తెలిపారు. ఇక సల్మాన్‌ మాటలను బట్టి చూస్తుంటే అతడు మళ్లీ లవ్‌లో ఫెయిల్‌ అయ్యాడేమోనని బాలీవుడ్‌లో గుసగుసలాడుకుంటున్నారు.

Love is nothing but need and marriage a waste of money

ఇక సల్మాన్ ఖాన్ నటించిన‘ట్యూబ్ లైట్’ మూవీకి బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రివ్యూ రేటింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. ఈ విషయమై సల్మాన్  ఖాన్ స్పందిస్తూ… సినిమా విమర్శకులు(క్రిటిక్స్) చాలా మంచి వారు. వారు నా సినిమాకు 3 లేదా 4 రేటింగ్ ఇస్తారని భావించాను. కానీ ఒకటి లేదా ఒకటిన్నర రేటింగ్ మాత్రమే ఇచ్చారు.

 Love is nothing but need and marriage a waste of money

అయినా నాకు గర్వంగానే ఉంది అని సల్మాన్ ఖాన్ అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. తానే నిర్మాతగా మారి నిర్మించిన ‘ట్యూబ్ లైట్’ మాత్రం పెద్ద ప్లాప్ అయింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. దీంతో ఈ సినిమా వల్ల సల్మాన్‌కు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు సినీ పండితులు.

- Advertisement -