ఉత్తరాదిన కుండపోత వర్షాలు

7
- Advertisement -

కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ సహా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రవాణా స్తంభించి పోయింది.

జమ్మూలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. అలాగే వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గం మూసివేశారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలకు ఐదుగురు మృతి చెందారు.

నైరుతి రుతుపవనాల కారణంగా ఇటు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందగా.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అలప్పుజలో ఇద్దరు మృతి చెందగా.. పల్లురుత్తికి చెందిన 18 ఏళ్ల బాలిక రోడ్డు పక్కన ఉన్న దుకాణం కూలిపోవడంతో మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లపై చెట్లు పడిపోవడంతో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది.

Also Read:డ్రగ్స్ నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడదాం

- Advertisement -