- Advertisement -
త్వరలో టూ విలర్ వినియోగదారులకు షాక్ తగలనుంది. జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిని సవరిస్తూ ఇకపై టూవీలర్స్ కూడా టోల్ కట్టాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల ఆటోలు టోల్ కట్టకుండానే జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నాయి. అయితే, ఈ విధానంలో మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
వచ్చే నెల అంటే జులై 15 నుంచి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Also Read:పాక్పై రాజ్నాథ్ ఫైర్
- Advertisement -

