డ్ర‌గ్స్ ర‌హిత జిల్లాగా న‌ల్ల‌గొండ‌:కోమటిరెడ్డి

6
- Advertisement -

డ్రగ్స్ రహిత జిల్లాగా నల్లగొండను మారుస్తామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.గురువారం నల్ల‌గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని…. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న‌ట్లు తెలిపారు. విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని, ఇందులో భాగంగా నల్ల‌గొండ‌లో రూ.34 కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read:పంత్‌పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసలు

డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని … విద్యార్థులకు ఏం కావాలన్నా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా, మంత్రిగా సహకారం అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.నల్ల‌గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా చేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -