పార్లమెంట్ కాదు రాజ్యాంగమే సుప్రీం!

8
- Advertisement -

పార్లమెంట్ కాదు రాజ్యాంగమే సుప్రీం అన్నారు సీజేఐ బీఆర్ గవాయ్.మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి సిటీలో జ‌రిగిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ప్ర‌జాస్వామ్యంలోని మూడు శాఖ‌లు రాజ్యాంగం కిందే ప‌నిచేస్తాయ‌ని గ‌వాయ్ తెలిపారు.

చాలా మంది పార్ల‌మెంటే సుప్రీం అన్న అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తార‌ని, కానీ త‌న వ‌ర‌కు రాజ్యాంగ‌మే అత్యున్న‌త‌మైంద‌న్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆదేశాలు జారీ చేస్తూ ఓ జ‌డ్జీ వ్య‌క్తిగ‌తంగా వ్య‌వ‌హ‌రించ‌లేర‌న్నారు.తాము డ్యూటీలో ఉన్నామ‌న్న విష‌యాన్ని ప్ర‌తి జ‌డ్జీ గుర్తుంచుకోవాల‌ని, పౌరుల హ‌క్కుల ప‌ట్ల.. రాజ్యాంగ విలువ‌లు, సూత్రాల ప‌ట్ల‌ ర‌క్ష‌కుల‌మ‌ని ఆయ‌న తెలిపారు.

తమ‌కు కేవ‌లం అధికారం ఉండ‌ద‌ని, కానీ దానిపై బాధ్య‌తాయుత‌మైన డ్యూటీ ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు ఏమంనుకుంటున్నారు, త‌మ న్యాయం ప‌ట్ల ఎట్ల స్పందిస్తున్నార‌న్న ఆలోచ‌న ఉండ‌రాద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా జ‌డ్జీ ఆలోచించాల‌న్నారు, ప్ర‌జ‌లు చెప్పేది మ‌న నిర్ణ‌యాత్మ‌క ఆలోచ‌న‌ల్లో భాగంగా కారాద‌న్నారు. పార్ల‌మెంట్‌కు స‌వ‌ర‌ణ‌లు చేసే అధికారం ఉంద‌ని, కానీ అది రాజ్యాంగంలోని మౌళిక అంశాల‌ను మార్చలేద‌ని అన్నారు.

Also Read:TTD:30 నుండి శ్రీవారి వైభవోత్సవములు

- Advertisement -