వందే భారత్ రైలు ఏసీ నుండి వాన నీళ్లు వచ్చాయి. వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న వందేభారత్ రైలులోని సీ-7 భోగిలో ఏసీ నుండి కుండపోతగా వర్షం పడింది. ఏకంగా 8 గంటలు ఆగకుండా వాన నీళ్లు పడుతూనే ఉన్నాయని, ఫిర్యాదు చేసిన స్పందించలేదని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుఖవంతమైన ప్రయాణం కోసం వందేభారత్ రైలును ఎంచుకుంటే, రేకుల షెడ్డులాగా వర్షం కురుస్తుందని, తన సామాన్లతో పాటు తాను కూడా తడిసిపోయాయని తెలిపారు. ప్రయాణ సమయం మొత్తం నిలబడే ఉన్నానని, తన టికెట్ డబ్బులు రీఫండ్ చేయాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.
అయితే నెటిజన్లు మాత్రం రైల్వే అధికారుల తీరుపై కౌంటర్ వేశారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల చల్లదనం కోసం రైల్వే శాఖ ఈ ఏర్పాటు చేసిందని సెటైర్లు వేశారు.
వందే భారత్ రైలు ఏసీ నుండి వాన నీళ్లు
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల చల్లదనం కోసం రైల్వే శాఖ ఈ ఏర్పాటు చేసిందని సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న వందేభారత్ రైలులోని సీ-7 భోగిలో ఏసీ నుండి కుండపోతగా జారిపడిన వర్షం నీళ్లు
ఏకంగా 8 గంటలు ఆగకుండా వాన… pic.twitter.com/1Ks51C0iiv
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2025
Also Read:కుబేర..4 రోజుల వసూళ్లెంతో తెలుసా?

