బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన హరీష్.. కౌశిక్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.
రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది… ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు అన్నారు.
కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు… వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతం అన్నారు.. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:Yoga Day:అంతర్జాతీయ యోగా దినోత్సవం..

