మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్, తన అన్న – సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కు లీగల్ నోటీసు పంపించారు. నోటీసులో కళానిధి మారన్‌పై నిబంధనలు ఉల్లంఘించి, వెయ్యికోట్ల విలువైన సన్ టీవీ గ్రూప్ షేర్లను అక్రమంగా తన పేరుపై మళ్లించుకున్నారని ఆరోపించారు.
ఈ షేర్ల విలువ వెయ్యల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కళానిధి మారన్‌పై దయానిధి తీవ్ర ఆరోపణలు చేశారు. కళానిధి మారన్ 2023 వరకు రూ. 5,926 కోట్లు,2024లో రూ. 455 కోట్లు డివిడెండ్ల రూపంలో పొందారని తెలిపారు. మీరు చేసిన అక్రమ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని నోటీసుల్లో పేర్కొన్నారు.
Sun TV Network Ltd సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ₹4,544 కోట్ల టర్నోవర్, ₹1,654.45 కోట్ల నికర లాభం ప్రకటించింది. కళానిధి మారన్, ఆయన భార్య కావేరి కళానిధి సహా ఇతరులతోపాటు SFIO, SEBI, ED వంటి సంస్థలను ఆశ్రయించి, సివిల్, క్రిమినల్, రెగ్యులేటరీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అలాగే, SUN TV Network Ltd మాలికత్వ నిర్మాణాన్ని 2003 సెప్టెంబర్ 15 నాటికి ఉన్న స్థితికి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వారంలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వివాదం తమిళనాడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read:ఒక్క మిస్డ్ కాల్ కూడా రాలేదు:కాంగ్రెస్ ఎంపీ

