‘ఆపరేషన్ సింధు’… మొదలైంది

6
- Advertisement -

ఆపరేషన్ సింధు మొదలైంది అని కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.

దీనికి ‘ఆపరేషన్ సింధు’ అని నామకరణం చేసినట్లు వెల్లడించింది కేంద్ర విదేశాంగ శాఖ. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఉత్తర ఇరాన్ నుంచి జూన్ 17న ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది విద్యార్థులను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.

వీరంతా జూన్ 19న ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నట్లు తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైశ్వాల్.

Also Read:కుబేర…డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

- Advertisement -