పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు ఎమ్మెల్యే మాణిక్య రావు. సోమవారం ఈ ఫార్ములా కేసులో సిబిఐ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో చేతగాని హామీలు ఇచ్చి పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకులపై పెట్టే కేసులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ రావడం ఖాయమన్నారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మళ్లీ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read:జనగణన.. నోటిఫికేషన్ జారీ

