కేంద్ర ప్రభుత్వం జనగణన నిర్వహణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనగణన 2027 కు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 1, 2027 నేది అన్ని రాష్ట్రాలు/కేంద్రమంత్రిత్వ ప్రాంతాల (UTs) కోసం రిఫరెన్స్ తేదీగా నిర్ణయించబడింది.
లడాక్ మరియు మంచుతో కప్పబడ్డ జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతాల కోసం అక్టోబర్ 1, 2026 రిఫరెన్స్ తేదీగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన ప్రారంభం కానుంది. తొలిదశలో ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, లడఖ్, హిమాచల్‌లో కులగణన చేపట్టనుండగా.. రెండోదశలో దేశవ్యాప్తంగా కులగణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో సాధారణంగా జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. చివరి జాతీయ జనగణన 2011లో జరిగింది.2021లో జరగాల్సిన జనగణనను కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది.
Also Read:భారత్..కరోనా అప్‌డేట్

