పల్లెబాట..ఎమ్మెల్యేకు నిరసన సెగ!

9
- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రజల నుండి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. నిన్న తొర్రూరు ఇవాళ మెత్యతండా గ్రామం. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు.

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మెత్యతండా గ్రామంలో పల్లె బాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , కాంగ్రెస్ ఇంఛార్జీ ఝాన్సీ రెడ్డి.తాగునీటి సమస్య ఉందని, విద్యుత్ అంతరాయం ఉందని, ప్రభుత్వ పథకాల మంజూరులోకాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఝాన్సీ రెడ్డిని నిలదీశారు గ్రామస్తులు.

ప్రజా సమస్యలు విననప్పుడు, ప్రజల కష్టాలపై స్పందించినప్పుడు పల్లె బాట కార్యక్రమం ఎందుకు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు.

Also Read:ఐదు రోజులు భారీ వర్షాలు!

- Advertisement -