గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది చెందిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరుగుతున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి దూకేశాడు. ఇక మరో మహిళ ఆలస్యంగా రావడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.
ట్రాఫిక్ జామ్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యం కావడంతో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది భూమి చౌహాన్ అనే మహిళ. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్ AI171ను బుక్ చేసుకుంది భూమి చౌహాన్.
ఎయిర్ పోర్ట్ కు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పది నిమిషాలు ఆలస్యం అయింది. అప్పటికే టేకాఫ్ అయ్యి ఫ్లైట్ కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిది. ప్రమాద ఘటన తనను ఒళ్లు గగుర్పొడిచేలా చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది భూమి చౌహాన్.
ఇక ఈ విమాన ప్రమాదం ఓ కుటుంబాన్ని మొత్తం బలితీసుకుంది. విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందారు. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ మృతి చెందారు.
Also Read:విమాన ప్రమాదం..కేసీఆర్ దిగ్బ్రాంతి

