మహారాష్ట్రలో కీలక పరిణామం..!

7
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మరియు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసింది. ఈ అనూహ్య పరిణామం, ఎంఎన్ఎస్ – శివసేన (ఉద్ధవ్) కలవనున్నారనే ప్రచారానికి తెరపడింది.

రాజ్ ఠాక్రే నివాసమైన శివతీర్థలో ఈ సమావేశం జరిగిందని సమాచారం. ఇదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)తో రాజ్ ఠాక్రే చేరికపై ఊహాగానాలు వెల్లివిరుస్తున్న వేళ ఈ భేటీ జరగడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.

సుమారు 20 నిమిషాల తర్వాత, అధికారిక షెడ్యూల్‌లో లేకపోయినా, ఫడణవీస్ కూడా అదే హోటల్‌కు చేరుకోవడం విశేషంగా మారింది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి రాకుండా చేయడంలోనే భాగంగా ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే-రాజ్ ఠాక్రే కూటమి ఏర్పడితే, ముంబయిలో బీజేపీకి గట్టి సవాలుగా మారే అవకాశం ఉండగా రాజ్ ఠాక్రేను సీఎం కలవడం రాజకీయ ఎత్తుగడలో భాగమని తెలుస్తోంది.

Also Read:గరుడవాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -