ఎంతటి వారైన చర్యలు తప్పవు!

8
- Advertisement -

డ్రగ్స్ వాడే వాళ్లు ఎంతటి ప్రముఖులైనా కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు తెలంగాణ పోలీసులు. మంగ్లీ బర్త్ డే పార్టీ ఘటన నేపథ్యంలో ఎక్స్ లో స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది మంగ్లీ.

పోలీసులు దాడి చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది మంగ్లీ. సింగర్ మంగ్లీ, త్రిపురా రిసార్ట్ జీఎం శివరామకృష్ణ సహా 9 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

చేవెళ్ల ఈర్లపల్లి శివారు త్రిపురా రిసార్ట్ లో బర్త్ డే పార్టీ జరుగగా పార్టీలో దాదాపు 48 మంది బంధుమిత్రులు, సినీ సెలెబ్రెటీలు పాల్గొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మంగ్లీ బర్త్ డే పార్టీ చేసుకోగా SOT పోలీసులు దాడులు చేశారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకోగా పార్టీలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. NDPS, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే త్రిపురా రిసార్ట్ పైనా కేసు నమోదు చేశారు.

Also Read:పల్లాను పరామర్శించిన కేసీఆర్

- Advertisement -