శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా..!

8
- Advertisement -

శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది. దీంతో స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదా పడింది. డ్రాగన్ వ్యోమనౌకలో నేడు సాయంత్రం 5.30 గంటలకు రోదసిలోకి వెళ్లాల్సి ఉంది శుభాంశు శుక్లా బృందం.

లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా మరోసారి ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది స్పేస్‌ఎక్స్‌. త్వరలోనే నూతన లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. జూన్ 11 బుధవారం రోజున ప్రయోగం జరపాలని నిర్ణయించినా, ఈసారి సాంకేతిక సమస్య ఎదురైంది.

ఈ మిషన్ మొత్తం 14 రోజుల పాటు కొనసాగనుంది. దీనిలో భాగంగా నాలుగు మంది అంతరిక్షయానికీ వెళ్లనున్నారు. మొత్తం 60 ప్రయోగాలను నిర్వహించనున్నారు. అందులో ఏడు ప్రయోగాలు ప్రత్యేకంగా ఇస్రో రూపొందించినవి.

 

Also Read:ఫ్రాడ్ కంపెనీలతో పెట్టుబడులా?

- Advertisement -