జ్యోతిషులను ఆశ్రయించిన తలైవా…!

203
Rajinikanth political entry astrology analysis.
- Advertisement -

జయలలిత మరణం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పొలిటికల్ ఎంట్రీ వార్తలు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే ఇదే క్రమంలో తమిళ తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరగుతోంది. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా అనే అంశం గురించి ఆయన అభిమానులతోపాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.

Rajinikanth political entry astrology analysis.

అభిమాన సంఘాలతో సమావేశమవుతూ మరింత ఉత్కంఠకు తెరలేపిన సూపర్‌స్టార్ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటారు. అయితే తాను రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? అనే విషయం గురించి రజనీ ఆరా తీస్తున్నారట.

అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తే రాణిస్తానా? నేను కింగ్ నవుతానా? లేక కింగ్ మేకర్2గా మిగులుతానా? అసలు నాకు రాజకీయాలు సరిపడతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొనేందుకు సూపర్ స్టార్ జ్యోతిష్కులను ఆశ్రయించినట్లు సమాచారం.

 Rajinikanth political entry astrology analysis.

తలైవాకు అత్యంత అప్తుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నలుగురు జ్యోతిష్కులను ఆయన సంప్రదించారట. వీరిలో ముగ్గురు జ్యోతిషులు రజనీకి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పగా, ఒకరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని, అంతగా కలిసిరాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. రజనీ సంప్రదించిన వారిలో ఒకరు తెలుగు, కన్నడ వ్యక్తులు కాగా మిగతా ఇద్దరు తమిళనాడుకు చెందినవారు.

రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇటీవల ఆయన అభిమానులతో సమావేశమైన సందర్భంలో యుద్ధం వస్తే చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించడంతో రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ఉద్దేశంతోనే ఉన్నారని, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రజిని ఏ వైపు అడుగు వేస్తారో.

- Advertisement -