సినిమా అంటే ఫ్యాషన్: విష్ణు

6
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా అనేది వ్యాపారం కాదు, అదొక ఫ్యాషన్. సినిమా పై ఆ పిచ్చి ప్రేమ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో ఉండగలం. నేనెప్పుడూ సినిమాని బిజినెస్ లా చూడలేదు అని తెలిపాడు.

ఒక నటుడిగా ఉండటానికే ఇష్టపడతాను… నటన అంటే తనకు ఆసక్తి అని తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read:కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హరీశ్‌రావు

- Advertisement -