కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ఈటల

5
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు ఎంపీ ఈటల రాజేందర్. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు.హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.

జస్టీ స్‌ పీసీ ఘోష్‌ ఆయనను విచారిస్తుండగా ఇప్పటికే పలు దఫాలుగా విచారణ పూర్తి చేసింది కమిషన్. అలాగే కేసీఆర్, హరీష్ రావులకు కూడా నోటీసులు ఇవ్వగా వారు కూడా విచారణకు హాజరుకానున్నారు. ఆర్థికశాఖ మంత్రిగా ఈటల కొనసాగిన సమయంలో బరాజ్‌లపై నిర్మాణం చేపట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయనిగా మారిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును నీరు గారుస్తున్నారన్న విమర్శ కూడా ఉంది.

Also Read:DSC పరీక్షలను వాయిదా వేయండి:షర్మిల

- Advertisement -