ఘోర ప్రమాదం.. 140 మంది సజీవ దహనం

182
- Advertisement -

రంజాన్‌ పండుగ వేళ పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 140 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పాకిస్తాన్ లో  చోటు చేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రం బహవల్‌పూర్‌ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. భారీగా ఆయిల్ భయటకు రావడంతో స్థానికులు బక్కెట్ల ద్వారా తోడుకుంటున్నారు. ఒక్కసారిగా ట్యాంకర్ పేలడంతో అక్కడున్నవారంతా సజీవ దహనం అయ్యారు. మరో 100 పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికులు ఆయిల్‌ తోడుకుంటుండగా.. ఓ వ్యక్తి సిగరెట్‌ తాగడంతో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -