విషాదంగా మారిన RCB విక్టరీ పరేడ్‌

11
- Advertisement -

ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచింది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరులో విక్టరీ పరెడ్ నిర్వహించగా 10 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో స్పాట్ లోనే ఊపిరాడక 10 మంది మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు.

చిన్నస్వామి స్టేడియంలో‌కి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు వారిని కట్టడి చేయలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తొలుత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆర్‌సీబీ విక్టరీ పరేడ్‌కు పోలీసులు అనమతి ఇవ్వలేదు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టుబట్టడంతో అనుమతి ఇచ్చారు.

దీంతో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహిస్తామని ఆర్‌సీబీ ప్రకటించింది. అభిమానులు నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ఫ్రీ పాసుల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. స్టేడియంలో సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్‌సీబీ అభిమానులతో చిన్నస్వామి స్టేడియం కిక్కిరిసింది. తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

Also Read:అతిగా కూర్చుంటే…అనర్థమే

 

- Advertisement -