ప్రజల తెలంగాణ..కట్టుబడి ఉన్నాం:రాహుల్

6
- Advertisement -

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.11 ఏళ్ల క్రితం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడింది అన్నారు.

రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షాన్ని, కలల్ని నెరవేర్చారు..తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు నా నివాళులు అని ఎక్స్ వేదికగా తెలిపారు.

తెలంగాణ ప్రజల భవిష్యత్తు అభ్యున్నతికి ‘ ప్రజల తెలంగాణ’ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి కలల్ని నెరవేరుస్తున్నాం అన్నారు.

 

Also Read:వీడియో..డల్లాస్‌లో కేటీఆర్ స్పీచ్

- Advertisement -