నానికి సారీ చెప్పిన ఎస్ జె సూర్య

7
- Advertisement -

నేచురల్ స్టార్ నానికి సారీ చెప్పారు నటుడు ఎస్‌జే సూర్య. సరిపోదా శనివారం చిత్రంలో నటనకు గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును ఇచ్చింది.

దీంతో సూర్యకు కంగ్రాట్స్ చెప్పారు నాని. సరిపోదా శనివారం’ చిత్రానికి కేవలం విలన్ లేదా సహాయ నటుడు మాత్రమే కాదు. మీరే అన్నీ. ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు అని ప్రశంసించారు. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎస్.జె. సూర్య ఆ సమయంలో కేవలం చాలా ధన్యవాదాలు అని మాత్రమే చెప్పారు.

తాజాగా సోషల్ మీడియాలో మరోసారి స్పందిస్తూ నానికి సారీ చెప్పారు. ప్రియమైన నేచురల్ స్టార్ నాని గారికి క్షమించండి. షూటింగ్ మధ్యలో ట్వీట్ చేయడం వల్ల అది సరైన స్పందన కాలేకపోయింది. కేవలం ‘థాంక్యూ సర్’ అని చెప్పడం సరిపోదని నాకు తెలుసు. మీరు, దర్శకుడు వివేక్ అందించిన మద్దతు లేకపోతే, షూటింగ్ నుంచి ఈ ట్వీట్ వరకు ఏదీ సాధ్యమయ్యేది కాదు. మీరు తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోనే. మీ దయగల మాటలకు చాలా చాలా ధన్యవాదాలు సర్ అని చెప్పుకొచ్చారు.

Also Read:హైదరాబాద్..టెక్ హబ్: కేటీఆర్

- Advertisement -