నకిలీ దేశభక్తులతో జాగ్రత్త:రావుల

9
- Advertisement -

నకిలీ దేశభక్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. రాజకీయాల కోసం భారత సైన్యాన్ని భాగస్వామ్యం చేయవద్దు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రావుల… కాంగ్రెస్ అధిష్టానం మెప్పుకోసమే రేవంత్ రెడ్డి సైనికులపై వ్యాఖ్యలు చేశారు అన్నారు. భారత సైన్యం రహస్య పరమైన అంశాలను బయటపెట్టాలని అనడం కరెక్ట్ కాదు అన్నారు.

ఇదే రేవంత్ రెడ్డి సైనికులకు మద్దతుగా ర్యాలీ చేశారు… అసలు కాశ్మీర్ లో కుంపటి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పిఓకె ఇండియాకు వచ్చేదని రేవంత్ రెడ్డి అనడం పెద్ద జోక్ అన్నారు.

రేవంత్ రెడ్డి 30 సార్లు ఢీల్లి వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు… రాహుల్ గాంధీ మెప్పుకోసం రేవంత్ రెడ్డి సైనికులపై మాట్లాడారు అన్నారు. భారత ఆర్మీ శక్తి సామర్ధ్యాలను రేవంత్ రెడ్డి శంకిస్తున్నారు… కాంగ్రెస్ పార్టీ దేశం మీదకు ఎలాంటి నాయకులను వదులుతుందో ప్రజలు గమనించాలి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ లు సైనికుల త్యాగాలను అవమానించడం సరికాదు..సైనిక దళాలకు దేశం యావత్ అండగా ఉండాలి అని పిలుపునిచ్చారు.

Also Read:కెనడాలో కార్చిచ్చు కలకలం..

- Advertisement -