కార్మికులకు అండ‌గా ఉద్య‌మిస్తాం:దాస్యం

6
- Advertisement -

చిరు వ్యాపారుల జీవితాల‌తో చెల‌గాటాలొద్దు అన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. హ‌నుమ‌కొండ చౌర‌స్తా వ‌ద్ద ఉన్న చిరు వ్యాపారుల స‌ముదాయాల‌ను మున్సిప‌ల్‌, పోలీస్ అధికారులు తొల‌గించిన నేప‌థ్యంలో వారిని ఆయ‌న శుక్ర‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బాధితులు వారితో మాట్లాడుతూ… గ‌త 15 ఏండ్లుగా చౌర‌స్తాలో చిన్న చిన్న వ్యాపారాలు, కూర‌గాయ‌లు అమ్ముతూ జీవ‌నోపాధి పొందుతున్నామ‌ని తెలిపారు.

ఇటీవ‌ల పోలీస్, మున్సిప‌ల్ అధికారులు త‌మ పొట్ట‌కొట్టార‌ని, వ్యాపార స‌ముదాయాల‌ను కూల్చార‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని గోడు వెళ్ల‌బోసుకున్నారు… కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి పేద‌ల‌పై ప్రేమ లేద‌ని , త‌మ జీవితాల‌ను ఆగం చేసింద‌ని వాపోయారు అన్నారు. పిండి ర‌మేష్ అనే చిరు వ్యాపారి జీవితం ఆగం అయ్యింద‌ని, జీవనోపాధి కోల్పోయామ‌ని ఆత్మ‌హ‌త్య చేసుకుని ఎంజీఎం ఆస్ప‌త్రిలో ఉన్నార‌ని బాధిత కుటుంబం విన‌య్ భాస్క‌ర్ కి తెలిపారు.

మ‌రో మ‌హిళ త‌న కూతురుతో స‌హ ఇక్క‌డ ఏండ్లుగా కూర‌గాయ‌లు అమ్ముతూ జీవితాన్ని వెళ్ల‌దీస్తున్నామ‌ని, నేడు రోజు గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది… మ‌రో మ‌హిళ అప్పులు తెచ్చి చిన్న వ్యాపారం చేస్తుంటే… కూల్చివేత‌ల కార‌ణంగా అప్పుల పాల‌మ‌య్యామ‌ని ఆవేద‌న చెందారు.అనంత‌రం దాస్యం విన‌య్ భాస్క‌ర్ గారు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌ల‌పై ప్రేమ‌, పేద‌ల‌పై ప్ర‌తాపం చూపుతోంది…కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాస్తే ఊరుకోం, కార్మికులకు అండ‌గా ఉద్య‌మిస్తాం అన్నారు.

కూర‌గాయ‌లు అమ్మే వారిని జీవితాల‌ను కూల్చుతున్నారు..చిరువ్యాపారుల జీవితాల‌తో చెల‌గాటాలొద్దు,చౌర‌స్తా చిరు వ్యాపారుల‌కు ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని, వారికి న‌ష్ట ప‌రిహారం అందించాలి..చౌర‌స్తాలోని వారి అడ్డాను పున‌రుద్ధ‌రించాలి, కొంత కాలంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్థానిక శాస‌న‌స‌భ్యులు, మున్సిప‌ల్ మేయ‌ర్ కాజీపేట నుంచి వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు ప్ర‌ధాన ర‌హ‌దారి వెంట ఉన్న చిరు వ్యాపారుల స‌ముదాయాల‌ను ధ్వంసం చేస్తున్నారు. వారి జీవితాల‌ను చిధ్రం చేస్తున్నారు అన్నారు.

Also Read:కెనడాలో కార్చిచ్చు కలకలం..

2014 చిరు వ్యాపారుల చ‌ట్టం ఉన్నా… చిరు వ్యాపారుల పొట్ట‌కొడుతున్నారు…చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న లేని ప్ర‌భుత్వం పేద‌ల బ‌తుకుల‌ను ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి,18 నెల‌ల కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింది..చిరు వ్యాపారుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు గులాబీ జెండా వారికి అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు..అనంత‌రం భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్ల బృందం బాధితుల‌తో క‌లిసి మున్సిప‌ల్ అధికారుల‌కు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి చిరు వ్యాపారుల‌కు న్యాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Also Read:కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్!

- Advertisement -