పేపర్ లీక్..లా పరీక్ష వాయిదా

6
- Advertisement -

తమిళనాడులోని మనోమణియం సుందరనార్ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించాల్సిన ఇండస్ట్రీయల్ లా పరీక్ష తాత్కలికంగా వాయిదా పడింది. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీ పరీక్ష నియంత్రణాధికారి తక్షణ చర్యలు చేపట్టారు.

ఇండస్ట్రియల్ లా పరీక్ష నిర్వహించాల్సిన యూనివర్సిటీకి చెందిన 106 అనుబంధ కళాశాలలన్నిటిలో ఈ పరీక్షను తేదీ ఖరారు చేయకుండా వాయిదా వేశారు. ఇప్పటికే పంపిన ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాల నుండి తిరిగి వెనక్కి తీసుకువచ్చారు.

ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై యూనివర్సిటీ అంతర్గత విచారణను కూడా ప్రారంభించింది.

Also Read:పాక్‌కు సరైన జవాబిస్తాం:మోదీ

- Advertisement -